Russia Minister : ఉక్రెయిన్ తో యుద్ధం అంత ఈజీగా ఆగదు .. ! 12 d ago
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ తో ఉన్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం లేదని గురువారం అన్నారు. రష్యా, పొరుగు దేశాలలో సుదీర్ఘ కాలానికి శాంతి నెలకొనేలా చట్టబద్ధమైన ఒప్పందం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంధికి మార్గాలు కనిపించడం లేదని బలహీనమైన ఒప్పందం జరిగితే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తాయని పేర్కొన్నారు.